శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (17:08 IST)

విజయవాడను ముంచెత్తిన వరదు.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం.. రైళ్లు రద్దు

train
విజయవాడ నగరం నీట మునిగింది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదితో పాటు బుడమేర కరకట్టలకు గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు జనావాస ప్రాంతాలను ముంచెత్తాయి. ఫలితంగా విజయవాడలోని అనేక ప్రాంతాలు జనదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వర్షాలు, వరద నీరు బీభత్సం సృష్టించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇది రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. విజయవాడ పరిధిలో కూడా పలు రైళ్ళను రద్దు చేసింది. 
 
ముఖ్యంగా తిరుపతి మీదుగా వెళ్లాల్సిన అనేక రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లు తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్, శబరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను ఐదున్నర గంటల ఆలస్యంగా నడుపుతున్నారు. విశాఖ - నాందేడ్, నాందేడ్ - విశాఖ రైళ్లను కూడా రద్దు చేశారు. చెన్నై - ఖత్రా ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ, విశాఖ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు.