శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (12:07 IST)

అమ్మాయితో టీడీపీ నేత రాసలీలలు - Video Viral

tdp leader romance
గత వైకాపా ప్రభుత్వంలో అధికారమదంతో వైకాపా నేతలు రెచ్చిపోయారు. అనేక మంది నేతలు రాసలీలలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నారు. ఇపుడు టీడీపీ నేతల వంతు వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు రాసలీలల్లో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీల వీడియో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఇపుడు మరో టీడీపీ నేత రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
రాయచోటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ బాషా ఓ అమ్మాయితో రాసలీలలు జరిపిన సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఖాదర్ బాషా ముఖ్య అనుచురుడు కావడం గమనార్హం. మంత్రి తరపున వ్యవహారాలు చక్కబెడతానని ప్రలోభ పెట్టి అమ్మాయిలను లొంగతీసుకుంటున్నట్లు ఖాదర్ బాషాపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. పైగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన గెలుపొందిన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల పరిశీలకులుగా పని చేశారు. ఇపుడు రాసలీలల వీడియోతో మరోమారు పత్రికల్లో పతాక శీర్షికలకెక్కారు.