శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (19:57 IST)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం

election commission
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల విధుల నిర్వహణ కోసం ఉపాధ్యాయులను తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులకు సరిపోరని భావించిన ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలో బుధవారం జరిగిన కీలక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని సీఈసీ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఉపాధ్యాయులనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలి సీఈసీ సూచించారు. శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను పంపాలని అన్ని జిల్లాల డీవీఓలను సీఈసీ ఆదేశించింది. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్లుగా వారిని నిర్ణయించనున్నారు.
 
కాగా, ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎన్నికలకు దూరంగా ఉంచేందుకు ఏపీ ఉచిత, నిర్బంద విద్య నియమాలు 2010కి సవరణ చేసింది. వారికి బోధనేతర పనులు అప్పగించవద్దని, విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేయాలని పేర్కొంది కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 27 ప్రకారం జనాభా గణన, విపత్తు సహాయ విధులకు స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసలు, పార్లమెంట్ ఎన్నికలకు అనుగుణంగా బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకు సవరణలు తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.