శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 జూన్ 2024 (23:08 IST)

తొక్కలో ముష్టి ఫర్నీచర్ ఎంతో చెప్పండి, జగన్ వెంట్రుక కూడా పీకలేరు: కొడాలి నాని

kodali nani
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాడుకున్నారని రాద్దాంతం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మాట్లాడుతూ... '' ముష్టి ఫర్నీచర్, తొక్కలో ఫర్నీచర్ ఎంతుంటుంది? డబ్బు ఇస్తాం పట్టుకుపొమ్మని చెప్పాం. కావాలంటే తీస్కెళ్లండి. ఆ ఫర్నీచర్ ఏమన్నా సాక్షిలో వేసుకున్నామా. క్యాంప్ ఆఫీసులో పెట్టిన ఫర్నీచర్ ఇంకెక్కడైనా పెట్టామా.
 
కెమేరాలు తీసుకెళ్లి రుషి కొండ భవనాల్లోని బాత్రూంల్లో 4 కెమేరాల్లో పెట్టి 30 లక్షలు పెట్టి కొన్నారంటూ గొడవ చేస్తున్నారు. అదేమన్నా జగన్ మోహన్ రెడ్డి ఇల్లా... ఆయన నీలా ఎవరి కొంపలో దూరరు. విశాఖపట్టణంలో ఇల్లు కట్టించుకుని అక్కడ వుంటారు.
 
ఎవరు ఎవర్ని టార్గెట్ చేయలేరు. నేను పోయినంత మాత్రాన వైసిపి ఏమీ ఆగదు. వీళ్లు జగన్ వెంట్రుక కూడా పీకలేరు'' అంటూ నోటికి పనిచెప్పారు.