శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 నవంబరు 2024 (10:29 IST)

సీఎం చంద్రబాబుకు ముద్దు పెట్టేందుకు మహిళ తీవ్రప్రయత్నం (Video)

woman kiss
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఓ మహిళ ముద్దుపెట్టే ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ మహిళను వారించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనకాపల్లి జిల్లా పర్యటన సమయంలో ఈ అనూహ్య ఘటన ఎదురైంది. 
 
సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించిన ఓ మహిళ.. ఉన్నట్టు ఆయన బుగ్గపై ముద్దు పెట్టేందుకు పలుమార్లు ప్రయత్నించింది. అయితే, చంద్రబాబు సున్నితంగా ఆమెను తిరస్కరించారు. అలాగే, భద్రతా సిబ్బంది కూడా ఆ మహిళను వారించారు. ఆ సమయంలో అక్కడ అంతా నవ్వులు విరబూశాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదివారం జిల్లాలోని పరవాడ పర్యటనను ముగించుకుని సభా వేదిక నుంచి కాన్వాయ్ వద్దకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పరావడకు చెందిన ఓ మహిళ చంద్రబాబుపై అభిమానంతో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి మురిసిపోయింది. ఆ తర్వాత ఆమె భుజంపై చంద్రబాబు ఆప్యాయంగా చేయి వేశారు. ఇదే మంచి తరుణంగా భావించిన ఆ మహిళ... చంద్రబాబు చెక్కిలిపై ముద్దు పెట్టేందుకు పలుమార్లు విఫలయత్నం చేశారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది ఆ మహిళను వారించి వెనక్కి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో టీవీలు, సోషల్ మీడియాలో వైరల్ అయింది.