శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (16:16 IST)

CM Babu Having Lunch On Floor విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు - లోకేశ్

chandrababu lunch
CM Chandra Babu and Nara Lokesh Having Lunch On Floor ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌లు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) జరిగింది. ఇందులోభాగంగా, బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యా మంత్రి, తన కుమారుడు నారా లోకేశ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణాన్ని పరిశీలించి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం చేశారు. వారితో కొద్దిసేవు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపడుు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.