శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (18:16 IST)

ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన హాజరుపరచండి : కోర్టు ఆదేశం

vallabhaneni vamsi
గతంలో జరిగిన ఓ ఎన్నికల కేసు విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న గన్నవరం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం అరెస్టు వారంట్ కూడా జారీచేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2019 ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనలో 38 మంది పోలీసులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణకు వల్లభనేని వంశీ హాజరుకావడం లేదు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా గతంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు జారీచేసింది. అయినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇపుడు ఆయనకు ఈ కోర్టు మరోమారు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. 
 
ప్రజాభవన్ వద్ద ఆటోకు నిప్పు పెట్టిన డ్రైవర్.. ఎందుకో తెలుసా? 
 
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ వద్ద ఓ డ్రైవర్ తనకు ఉపాధిని కల్పించే ఆటోకు నిప్పు పెట్టాడు. తెలంగాణంలో ఇటీవల ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో ఆటోలలో ఎక్కే ప్రయాణికులే కరువయ్యారు. ఫలితంగా అనేక మంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి రోడ్డునపడ్డారు. పలుచోట్ల ఆటో డ్రైవర్లు ఆందోళన కూడా చేశారు. ఈ క్రమంలో గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో తన ఆటోకు ప్రజాభవన్ ఎదురుగా నిప్పు పెట్టాడు. పంజాగుట్ట పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
పాలమూరు జిల్లాకు చెందిన దేవ్ల అనే వ్యక్తిని భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి మియాపూర్‌లో ఉంటూ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆటోకు కిరాయి సరిగా లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఇక్కడా.. ఇక్కడా అప్పులు చేశాడు. దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునిపోయాడు. 
 
ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆటోలో ప్రజాభవన్ వద్దకు వచ్చి సరిగ్గా 7 గంటల సమయంలో ఆటోపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించాడు. దీంతో ఆటో మంటల్లో కాలిపోయింది. ఈ క్రమంలో ఆటుకు సమీపానికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు దేవ్లను పట్టుకుని వారించారు. గిరాకీ లేక పూటగడవడమే కష్టంగా ఉందని దేవ్ల వాపోయాడు. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.