శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2024 (12:48 IST)

చందానగర్ స్పా సెంటరులో వ్యభిచారం... యువతులు.. విటులు అరెస్టు!!

prostitute
హైదరాబాద్ నగరం చందానగర్‌లోని ఓ స్పాట్ సెంటరులో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచార గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. ఈ తనిఖీల్లో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు విటులను పోలీసులు అరెస్టు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. పక్కా సమాచారం హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
మరో ఘటనలో కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డులోని సెలూన్ షాపులో పోలీసులు సోదాలు చేశారు. సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. 
 
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోలని బార్‌‍లు, పబ్‌లపై ఆకస్మిక దాడులు చేశారు. హైదరాబాద్ నగరంలో 12, రంగా రెడ్డిలో 13 బార్లు, పబ్బులపై శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అబ్కారీ నిఘా విభాగం డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేశారు. 25 ప్రముఖ బార్లు, పబ్బులపై 25 ప్రత్యేక బృందాలతో ఈ దాడులు జరిగాయి. డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షలు చేశారు.