బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (09:56 IST)

జగన్ పాలనలో రెడ్లు బాగా నష్టపోయాం.. కానీ : కేతిరెడ్డి (Video)

ketireddy
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వైకాపా ప్రభుత్వ పాలనలో రెడ్డి సామాజిక వర్గం ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. అయితే, ఆయన పాలనలో రెడ్లు తలెత్తుకుని నిలబడేలా చేశారని, ఇది ప్రతి ఒక్క రెడ్డికి గర్వకారణమన్నారు. 
 
అనంతపురం ధర్మవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నష్టపోయిన మాట నిజమేనన్నారు. ఆర్థికంగా చాలా నష్టం జరిగిందన్నారు. కానీ, ప్రతి ఒక్క రెడ్డి తలెత్తుకుని తిరిగేలా జగన్ చేశారన్నారు. 
 
అలాగే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ఎంతో గొప్పదన్నారు. ఈ పథకాల వల్ల కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందారన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను నిర్వహించిన గుడ్ మార్నింగ్ దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రతి రోజూ ఉదయం కనీసం 10 నుంచి 20 మంది వరకు తన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారని, ఆ సమస్యలకు పరిష్కారం చూపించడంలో ఒక ఎమ్మెల్యేగా తనకు ఎంతో సంతృప్తి మిగిలిందన్నారు.