శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (12:26 IST)

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

ear cut tdp follower
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో కొన్ని చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక చర్యలు మరింతగా పెరిగిపోయాయి. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా పెట్రేగిపోతున్నారు. వైకాపాకు కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైకాపా నేత ఒకరు కోసేశాడు. 
 
బాధితులు స్థానికులు అందించిన సమాచారం మేరకు పందువ గ్రామానికి చెందిన తిమోతి ఇటీవలేవైకాపాను వీడి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఎన్నికల సమయంలో బంధువులు, చుట్టుపక్కలవారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు.
 
ఈ నేపథ్యంలో తిమోతిపై స్థానిక వైకాపా నేత గురవయ్య అక్కసు పెంచుకున్నాడు. రోడ్డుపై వెళుతున్న తిమోతిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తిమోతిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.