మంగళవారం, 28 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2025 (12:21 IST)

ఇంటర్ - డిగ్రీ విద్యార్హతతో రైల్వేలో ఉద్యోగాలు

jobs
దేశ వ్యాప్తంగా పలు రైల్వే రీజియన్‌లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌లో ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 8050 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 5 వేల పోస్టులు గ్రాడ్యుయేట్, 3050 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్‌లు ఉన్నాయి. డిగ్రీ విద్యార్హతతో భర్తీ చేసే పోస్టులకు అక్టోబరు 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక అండర్ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు అక్టోబరు 28వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చెన్నై, చండీగఢ్‌, గోరఖ్‌పూర్, జమ్మూశ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం తదితర రీజియన్లలో ఉన్న రైల్వే ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 16 నుంచి 33 యేళ్లకు మించరాదు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి. భర్తీ చేయనున్న పోస్టుల్లో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్  సూపర్‌వైజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్స్ కమ్ టైపిస్ట్ తదికర ఉద్యోగాలు ఉన్నాయి.