శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:34 IST)

కేంద్ర బడ్జెట్ 2024: మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం

Nirmala Seetharaman
Nirmala Seetharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. తాత్కాలిక బడ్జెట్ కావడంతో పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకోవద్దంటూ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 
 
కాగా, పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేక పోయిందని ఆర్థిక విశ్లేషకులు చెప్పారు. 
 
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.51వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం టార్గెట్‌గా పెట్టుకోగా.. డీఐపీఏఎం వెబ్‌సైట్ ప్రకారం ఇప్పటి వరకు కేవలం రూ.10,051.73 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది.