మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (10:53 IST)

వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధరలో కాస్త ఉపశమనం

gas cylinder
గత కొన్ని నెలలుగా ధరల మోతతో ఇబ్బంది పడుతున్న వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు సెప్టెంబరు ఒకటో తేదీ గురువారం శుభవార్త చెప్పాయి. వాణిజ్య అవసరాలకు వినయోగదారులకు వంట గ్యాస్ ధరను కొంతమేరకు తగ్గించాయి. 19 కేజీల గ్యాస్ బండపై 91.50 మేరకు తగ్గించింది. ఈ తగ్గించిన ధర తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. 
 
ఈ తగ్గింపు కారణంగా ఢిల్లీ వాణిజ్య గ్యాస్ బండ ధర రూ.1976.07 నుంచి రూ.1885కు తగ్గింది. ముంబైలో రూ.1995.50, చెన్నైలో రూ.2045, హైదరాబాద్ నగరంలో రూ.2099కు చేరుకున్నాయి. అయితే, గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. 14.2 కేజీల గ్యాస్ బండ ధరను గత జూలై 6వ తేదీన రూ.50కి పెంచిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత ఈ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, వాణిజ్య వంట గ్యాస్ ధరను తగ్గించడం జూన్ నెల తర్వాత ఇది వరుసగా నాలుగో యేడాది కావడం గమనార్హం. జూలైకు ముందు ఒక దశలో వాణిజ్య గ్యాస్ ధర రికార్డు స్థాయిలో రూ.2354కు చేరిన విషయం తెల్సిందే. జూలై నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది.