శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (14:59 IST)

డాక్టర్ సి. హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ ఎచివర్స్ అవార్డు అందజేసిన నితిన్ గడ్కారీ

Dr. C. H. Bhadra Reddy receving award from Nitin Gadkari
Dr. C. H. Bhadra Reddy receving award from Nitin Gadkari
మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ సి. హెచ్. భద్ర రెడ్డికి ఇండియన్ హెచ్ వర్సే అవార్డ్ లభించడం చాలా ఆనందకరం. వైద్య మరియు విద్య రంగంలో ఆయన అందించిన అశేషమైన సేవలకు ఆయనకు అవార్డు లభించింది. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యనందిస్తూ అదేవిధంగా ఎంతోమందికి వైద్య సహకారాలు అందిస్తూ ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. గత నెల 28న ఇంటర్ ఆక్టివ్ ఫారం ఆన్ ఇండియన్ ఎకానమీ ద్వారా న్యూఢిల్లీలోని హయత్ రెజెన్సీ లో జరిగిన కార్యక్రమంలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ నితిన్ గడ్కారీ గారి చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు.
 
ఈ అవార్డు ఈయనతో పాటు సినీ, క్రీడా రంగాలకు సంబంధించిన ప్రముఖులకు అదేవిధంగా సామాజిక సేవ చేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ్ ఖన్నా, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సత్పాల్ సింగ్ లాంటి కొంతమంది ప్రముఖులు అవార్డును  అందుకోవడం జరిగింది.