శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (17:32 IST)

ప్రైమ్ సిటీ ఇండెక్స్ 2024 - అగ్రస్థానంలో హైదరాబాద్

charminar
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ప్రైమ్ సిటీ ఇండెక్స్ 2024 నివేదికలో హైదరాబాద్ టాప్ సిటీగా నిలిచింది. సామాజిక-ఆర్థిక విభాగంలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, ముంబై నిలిచాయి. 
 
రియల్ ఎస్టేట్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవగా, బెంగళూరు, ముంబై వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 
 
ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్, ముంబై రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పాలనలో, ఢిల్లీ- ఎన్సీఆర్‌ మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండవ స్థానంలో, అహ్మదాబాద్, ముంబై తర్వాతి స్థానంలో ఉన్నాయి.