శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 12 నవంబరు 2024 (23:17 IST)

భారతీయ స్టార్టప్‌లకు సాధికారతకై ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫస్ట్ వింగ్స్ స్టార్ట్-అప్ లాంజ్‌ ప్రారంభం

FIRST WINGS Startup
కర్టెసి-ఐడిఎఫ్సి
ఐడిఎఫ్సి ఫస్ట్  బ్యాంక్, ఈ రోజు స్టార్టప్ లాంజ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది భారతదేశంలో వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి, ప్రారంభ-దశ స్టార్టప్‌లకు సాధికారత కల్పించడానికి రూపొందించబడిన ప్రత్యేక ప్రాంగణం. బెంగుళూరులోని కోరమంగళలో ఉన్న ఈ వినూత్న ప్రాంగణం, తమ వ్యాపారాలను విస్తరింప చేయాలనుకునే వ్యవస్థాపకులకు అవసరమైన వనరులు, మార్గదర్శకత్వం, నెట్‌వర్కింగ్ అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఈ సందర్భంగా శ్రీ భవేష్ జటానియా, హెడ్ స్టార్టప్ బ్యాంకింగ్ మాట్లాడుతూ, "భారతదేశంలో ఒక బ్యాంకు ద్వారా ప్రారంభించబడిన మొట్టమొదటి, వినూత్న కార్యక్రమం, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టార్టప్ లాంజ్‌ని ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ స్టార్టప్ లాంజ్ సమావేశ, సహకార కేంద్రంగా పనిచేస్తుంది, వ్యవస్థాపకులకు ఆవిష్కరణలు, అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. ప్రముఖ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఏంజెల్ ఇన్వెస్టర్‌లతో కూడా ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ భాగస్వామిగా ఉంటుంది, వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణంలో స్టార్టప్‌లు పోటీతత్వాన్ని పొందడంలో సహాయపడే సినర్జీలను సృష్టిస్తుంది.." అని అన్నారు. 
 
ఫస్ట్ వింగ్స్ స్టార్ట్-అప్ లాంజ్‌లో మీటింగ్ రూమ్‌లు, అధునాతన వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలతో సహా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు అనుసంధానం కావడానికి, సహకరించడానికి, ఎదగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించారు.,వ్యవస్థాపకులకు అదనపు సహాయాన్ని అందించడానికి ఈ లాంజ్ పలు కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.
 
నాలెడ్జ్ సెషన్‌లు: పరిశ్రమ నిపుణులు నిర్వహించే క్యూరేటెడ్ నాలెడ్జ్ రిసోర్స్‌లు మరియు మెంటార్‌షిప్ సెషన్‌లలో పాల్గొనే అవకాశం
నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు: స్టార్టప్‌లను పెట్టుబడిదారులు మరియు పరిశ్రమ నిపుణులతో అనుసంధానించే కార్యక్రమాలు 
పిచ్ ప్రెజెంటేషన్‌లు: సంభావ్య పెట్టుబడిదారులకు వ్యాపార ఆలోచనలను ప్రదర్శించటం తో పాటుగా విలువైన అభిప్రాయాన్ని స్వీకరించవచ్చు 
ఐడిఎఫ్సి ఫస్ట్  బ్యాంక్ ప్రారంభించిన ఫస్ట్ వింగ్స్ స్టార్టప్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఆకర్షణలు :
 
ఫస్ట్  స్టార్ట్-అప్ కరెంట్ ఖాతా: ప్రారంభ దశ స్టార్టప్‌లకు తొలి మూడేళ్లలో కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా ఉచిత బ్యాంకింగ్ సేవలతో జీరో ఫీజు కరెంట్ ఖాతా.
 
ఫస్ట్ బ్రావో ఫీచర్: స్టార్టప్‌లు రూ. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలోకి ఆటోమేటిక్‌గా బదిలీ చేయడం ద్వారా నిష్క్రియ నిధులపై 7.25% వరకు రాబడిని సంపాదించడానికి అనుమతించే స్మార్ట్ స్వీప్ సౌకర్యం.
 
ఫస్ట్ వ్యాపార కార్పొరేట్ క్రెడిట్ కార్డ్: స్టార్ట్-అప్‌లు తమ వ్యాపార ఖర్చులను ఫ్లెక్సిబుల్ స్టెప్-అప్ క్రెడిట్ ఫీచర్‌తో నిర్వహించడంలో సహాయపడటానికి రూపొందించబడింది.
 
ఫౌండర్ సక్సెస్ ప్రోగ్రామ్: "లీప్ టు యునికార్న్" అనేది ఖచ్చితమైన ప్రణాళికతో కూడిన ప్రయాణం ద్వారా మెంటర్‌షిప్, నెట్‌వర్కింగ్ మరియు నిధుల సేకరణ అవకాశాలను అందించే వినూత్నమైన కార్యక్రమాలలో ఒకటి.