శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2024 (20:19 IST)

ఏలూరులో కొత్త శాఖను ప్రారంభించిన జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్

image
జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో తన కొత్త శాఖను ప్రారంభించినట్లు వెల్లడించింది. పవర్‌పేట్ ప్రాంతంలో ఉన్న ఈ శాఖ, జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 10వ శాఖ కాగా భారతదేశంలో 126వ శాఖ. ఈ వ్యూహాత్మక విస్తరణ దక్షిణ భారతదేశంలో కంపెనీ కార్యకలాపాలను మరింత బలపరుస్తుంది, ఇది సరసమైన గృహ రుణాలను విస్తృత శ్రేణిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సీనియర్ అధికారుల సమక్షంలో జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్ ఎండి & సీఈఓ శ్రీ మనీష్ సేథ్ ఈ కొత్త శాఖను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా, జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్, ఎండి & సీఈఓ శ్రీ మనీష్ సేథ్ మాట్లాడుతూ, “మా 126వ శాఖను ఆంధ్రప్రదేశ్‌లో  ప్రారంభించడం సంతోషంగా వుంది. మా సరసమైన, పారదర్శకమైన, సులభంగా లభించగల గృహ ఋణ పరిష్కారాలతో, మేము నగరం, చుట్టుపక్కల ప్రాంతాలలో గృహ ఋణ డిమాండ్‌ను తీర్చడానికి కట్టుబడి ఉన్నాము. వ్యక్తులు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడంలో మా నిబద్ధతను ఇది  నొక్కి చెబుతుంది' అని అన్నారు.
 
జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్ గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు మరియు గృహ నిర్మాణం, అభివృద్ధి, విస్తరణ కోసం ఋణాలతో సహా అనేక రకాల ఋణ ఉత్పత్తులను అందిస్తుంది.  ఈ శాఖ ప్రారంభంతో, జెఎం ఫైనాన్షియల్ హోమ్ లోన్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో సరసమైన హౌసింగ్ ఫైనాన్స్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది, ఈ ప్రాంతంలోని గృహ కొనుగోలుదారులకు తగిన పరిష్కారాలను అందిస్తుంది.