శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 నవంబరు 2023 (19:29 IST)

వరంగల్‌లోని సిబిఎస్ఇ భాగస్వామ్యంతో ‘సీఖో పైసో కి భాషా’ నిర్వహించిన కోటక్ మ్యూచువల్ ఫండ్

students
కోటక్ మ్యూచువల్ ఫండ్, వరంగల్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) భాగస్వామ్యంతో తన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమం, ‘సీఖో పైసో కి భాష’ని నిర్వహిస్తోంది. ఉపాధ్యాయుల ఆర్థిక అవగాహన వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో విస్తృతమైన విద్య మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆర్థిక అక్షరాస్యతకు మార్గం సుగమం చేయడానికి ఈ కార్యక్రమం నిర్దేశించబడినది మరియు చివరికి ఇది సంభావ్య ప్రగతిశీల భవిష్యత్తు వైపు భారతదేశ ప్రయాణానికి దోహదపడుతుంది.
 
ఆంధ్రప్రదేశ్‌లోని 1050 మందికి పైగా CBSE ఉపాధ్యాయులు, వరంగల్‌లోని 300 మందికి పైగా ఉపాధ్యాయులకు ఆర్థిక అక్షరాస్యత గురించి అవగాహన కల్పించడం, విద్యావంతులను చేయటం ఈ కార్యక్రమ లక్ష్యం. వీరిలో, 50% స్త్రీలు ఉండవచ్చని అంచనా వేయబడింది, ఇది సమానమైన వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, సెంటర్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ (CIEL) నుండి 500 మందికి పైగా నిష్ణాతులైన శిక్షకులను కోటక్ మ్యూచువల్ ఫండ్ తీసుకువచ్చింది, వారు ప్రోగ్రాం అంతటా నాణ్యత, ఔచిత్యం ఉండేలా చూసేందుకు ప్రభావవంతమైన సెషన్‌లకు నాయకత్వం వహించారు.
 
బాలాజీ టెక్నో స్కూల్ (వరంగల్), ప్రిన్సిపల్, పి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "మా ఉపాధ్యాయులు డబ్బును తెలివిగా నిర్వహించడం గురించి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమంలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది దీర్ఘకాలంలో సంపదను నిర్మించడానికి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి వారికి సహాయపడుతుంది.." అని అన్నారు.
 
కోటక్ మ్యూచువల్ ఫండ్ డిజిటల్ బిజినెస్, మార్కెటింగ్ మరియు అనలిటిక్స్ హెడ్ శ్రీ కింజల్ షా మాట్లాడుతూ, "ఈ పెట్టుబడిదారుల విద్య మరియు అవగాహన కార్యక్రమం 'సీఖో పైసో కి భాషా' ద్వారా ఆర్థిక సాధికారతను పెంపొందించడానికి మేము  కట్టుబడి ఉన్నాము. మన దేశం యొక్క భవిష్యత్ ను  రూపొందించడంలో మరియు కొత్త తరాన్ని తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని మేము విశ్వసిస్తున్నాము.  CBSEతో మా భాగస్వామ్యం ఆర్థిక అక్షరాస్యత మరియు పెట్టుబడి గురించి గౌరవనీయమైన విద్యావేత్తలకు అవగాహన కల్పించడం చేయనున్నాము. సమిష్టిగా, ఆర్థికంగా అవగాహన ఉన్న ఉపాధ్యాయులు సహాయంతో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడే భవిష్యత్తును మేము రూపొందించగలము..." అని అన్నారు
 
దేశం యొక్క పురోగతి మరియు అభివృద్ధి కోసం సంపూర్ణంగా సరిపోలే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఆర్థికంగా సాధికారత కలిగిన ఇండియా, సాక్షాత్కారానికి ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. ‘సీఖో పైసో కి భాషా’ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ఆకృతిని అందించటానికి సహాయపడుతుందని ఆశిస్తున్నారు.