శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2024 (19:07 IST)

పాప్‌కార్న్‌పై జీఎస్టీ పిడుగు పడింది... నవ్వుకుంటున్న జనం.. మండిపడుతున్న ప్రజలు

popcorn
పాప్‌కార్న్‌పై జీఎస్టీ పిడుగు పడింది. పాప్‌కార్న్‌పై మూడు రకాల జీఎస్టీ శ్లాబ్‌లు విధించడం సంచలనం రేపింది. దీంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. నిర్మలమ్మ వడ్డనతో కన్సూమర్లు, సినీ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
2030 నాటికి 12 శాతం కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్‌ ఉంది. ఆ సమయానికి పాప్‌కార్న్ ఇండస్ట్రీ మార్కెట్‌  రూ. 2,572 కోట్లకు చేరకుంటుంది అన్నది అంచనా. ఎందుకంటే పాప్‌కార్న్‌పై మూడు రకాల జీఎస్టీని విధించింది కేంద్రం. 
 
ప్యాకెట్‌లో లేని పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ విధించారు. ప్యాకెట్‌లో వచ్చే, లేబుల్‌తో కూడిన పాప్‌కార్న్‌పై 12 శాతం GST విధించారు. పంచదారతో కలిపి తయారు చేసిన పాప్‌కార్న్‌ను 18 శాతం పన్ను శ్లాబ్‌లో ఉంచారు. పాప్‌కార్న్‌ను రుచికి అనుగుణంగా వివిధ శ్లాబ్‌లలో ఉంచింది కౌన్సిల్. 
 
వంద రూపాయల పాప్‌ కార్నర్‌కి 18శాతం జీఎస్టీ యాడ్‌ చేస్తే, అది వినియోగదారుడికి చేరేసరికి 120 అవుతుంది. సామాన్యులు తినే పాప్‌కార్న్‌పై జీఎస్టీ రేట్లు పెంచడం ఏంటంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.