బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 అక్టోబరు 2024 (22:35 IST)

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ‘ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్’ను పరిచయం చేసిన టొయోటా

Toyota
టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఈ రోజు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ‘ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్’ని పరిచయం చేసింది, ఇందులో ప్రత్యేకమైన టొయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (టిజిఏ) ప్యాకేజ్‌లు ఉన్నాయి. 2022లో విడుదల అయినప్పటి  నుండి, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ దాని అత్యాధునిక సాంకేతికత, డైనమిక్ పనితీరు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో దేశవ్యాప్తంగా వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 
 
టొయోటా కిర్లోస్కర్ మోటార్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ, “2022లో విడుదల చేసినప్పటి నుండి, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ స్థిరమైన మొబిలిటీని అందించడంలో టికెఎం యొక్క నిబద్ధతకు చిహ్నంగా ఉంది. అధిక కస్టమర్ సంతృప్తితో అపూర్వమైన ప్రజాదరణను పొందింది. పెరుగుతున్న డిమాండ్, సానుకూల ఆదరణ మా ఆఫర్‌లను నిరంతరం మెరుగుపరచడానికి మమ్మల్ని ప్రోత్సహించాయి.
 
ప్రత్యేకమైన టిజిఎ ప్యాకేజీని కలిగి ఉన్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ పరిచయంతో, మేము మా కస్టమర్‌లకు మరింత వ్యక్తిగతీకరించిన మరియు ప్రీమియం డ్రైవింగ్ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ ప్రత్యేక ఆవిష్కరణలో భాగంగా, 31 అక్టోబర్ 2024 వరకు భారతదేశంలోని డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచబడిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను ఎంచుకునే కస్టమర్‌ల కోసం రూ. 50,817 విలువైన కాంప్లిమెంటరీ ప్యాకేజీని టికెఎం అందిస్తోంది.