గురువారం, 13 నవంబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 నవంబరు 2025 (23:34 IST)

తమిళనాడు డిస్కమ్ నుంచి వేదాంత పవర్ బిజినెస్ 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం

Vedanta-s Power
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వేదాంత లిమిటెడ్ థర్మల్ వ్యాపార యూనిట్లు మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్ 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పొందాయి. ఇది తన స్వతంత్ర విద్యుత్తు ఉత్పత్తిదారు వ్యాపారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుండగా, భారతదేశ ఇంధన భద్రతకు నమ్మకమైన సహకారిగా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
 
లెటర్స్ ఆఫ్ అవార్డు (LOAs) ప్రకారం, వేదాంత MEL, VLCTPP వరుసగా 300 MW, 200 MW విద్యుత్‌ను TNPDCLకి సరఫరా చేస్తాయి. ఫిబ్రవరి 1, 2026 నుంచి జనవరి 31, 2031 వరకు అమలులో ఉండే ఈ ఐదేళ్ల ఒప్పందాన్ని ~₹5.38/kWh టారిఫ్‌తో ప్రదానం చేశారు. వేదాంత పవర్, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని మీనాక్షి ఎనర్జీ, ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత లిమిటెడ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నాయి,TNPDCL ద్వారా టెండర్ చేయబడిన మొత్తం 1,580 MWలలో అత్యధికంగా 500 MW కేటాయింపును పొందింది. ఇది విద్యుత్ రంగంలో దాని పోటీతత్వానికి, కార్యాచరణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రెండు విద్యుత్ ప్లాంట్లను ఇటీవల వేదాంత రికార్డు సమయంలో కొనుగోలు చేసి, కార్యాచరణలోకి తీసుకువచ్చింది.
 
దీని గురించి వేదాంత లిమిటెడ్ పవర్- సీఈఓ రాజిందర్ సింగ్ అహుజా మాట్లాడుతూ, భారతదేశ ఇంధన భద్రతకు విశ్వసనీయమైన బేస్‌లోడ్ శక్తి చాలా ముఖ్యమైనది కాగా, ఆ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో థర్మల్ శక్తి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విజయం సమర్థవంతమైన, విశ్వసనీయమైన నమ్మదగిన విద్యుత్ ఉత్పత్తిలో వేదాంత పెరుగుతున్న నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీనాక్షి ఎనర్జీ, VLCTPP  మా విజయవంతమైన మలుపు మా ఆపరేటింగ్ మోడల్  బలాన్ని ప్రదర్శిస్తూ, సంక్లిష్ట ఆస్తుల నుంచి విలువను సృష్టించే వేదాంత సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (PPA) ఆదాయ విజిబిలిటీని, ఆర్థిక బలాన్ని మెరుగుపరుస్తాయి. వేదాంత పవర్ గుర్తింపు కింద మా విద్యుత్ పోర్ట్‌ఫోలియో ప్రతిపాదిత విభజన వైపు మేము కదులుతున్నప్పుడు భవిష్యత్ వృద్ధికి పునాది వేస్తాయి అని వివరించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో 1,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ మీనాక్షి ఎనర్జీని 2023లో వేదాంత కొనుగోలు చేసింది. రెండేళ్లలోనే ప్లాంట్‌ను పూర్తి కార్యాచరణ సామర్థ్యానికి తీసుకువచ్చి, వేగవంతమైన పునరుద్ధరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేసింది. అదేవిధంగా, ఛత్తీస్‌గఢ్‌లోని సింగితారాయ్‌లోని 1,200 మెగావాట్ల వేదాంత లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్ (VLCTPP) (గతంలో అథీనా పవర్), 2022లో సగం పూర్తయిన ప్రాజెక్టుగా కొనుగోలు చేసింది. ఆగస్టు 2025లో దాని మొదటి 600 మెగావాట్ల యూనిట్‌ను ప్రారంభించింది.
 
పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశా వ్యాప్తంగా దాదాపు 5GW మర్చంట్ పవర్ (IPP ఆస్తులు)తో సహా, వేదాంత తన వ్యాపారాల అంతటా దాదాపు 12 GW థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని నిర్వహిస్తోంది. వేదాంత పవర్ వ్యాపారం కింద సమిష్టిగా ఉంచబడిన ఈ ఆస్తులు, భారతదేశం  ఇంధన భద్రతను, ఆర్థిక స్థితిస్థాపకత వైపు ప్రయాణాన్ని బలపరుస్తాయి.