శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 నవంబరు 2024 (19:02 IST)

2030 నాటికి నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని నిర్మించడంపై దృష్టి సారించిన తెలంగాణ

image
నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క డిమాండ్‌లకు అనుగుణంగా తెలంగాణ తన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి పరివర్తనాత్మక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘బ్రిడ్జింగ్ ది గ్యాప్: ఇంటిగ్రేటింగ్ స్కిల్లింగ్ ఇన్‌టు తెలంగాణస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిపోర్ట్’ను ఈవై-పార్థెనాన్ సహకారంతో సిఐఐ తెలంగాణ రూపొందించింది. రాష్ట్ర విద్యా రంగానికి సంబంధించిన సమగ్ర విశ్లేషణను ఇది అందిస్తుంది. మారుతున్న పోకడలు, సవాళ్లు, అవకాశాలను ఇది వెల్లడించటంతో పాటుగా వృత్తి శిక్షణ, పరిశ్రమ-సమలేఖన నైపుణ్యాలను పాఠ్యాంశాల్లోకి చేర్చవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.
 
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2023-24లో US$ 187 బిలియన్లకు చేరుకుంటుందని, 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధికి తోడ్పాటునందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తమ యువతను లైఫ్ సైన్సెస్, ఐటీ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, డిఫెన్స్ వంటి అధిక వృద్ధి రంగాల్లో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడంపై దృష్టి సారిస్తోంది.
 
ఈ నివేదిక గురించి ఈవై-పార్థెనన్ భాగస్వామి డాక్టర్ అవంతిక తోమర్ మాట్లాడుతూ, “సాంప్రదాయ విద్యా నమూనాలలో నైపుణ్య విద్య, వృత్తి శిక్షణను మిళితం చేయటం భారతదేశంతో సహా దేశం యొక్క ఎదుగుదలకు, పోటీతత్వానికి కీలకం. జాతీయ జిడిపి వృద్ధిని మించి తెలంగాణ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణకు ఉన్నత, నైపుణ్య విద్యలో అనేక అవకాశాలు ఉన్నాయి" అని అన్నారు. 
 
సిఐఐ తెలంగాణ చైర్మన్ శ్రీసాయి ప్రసాద్ నొక్కిచెబుతూ, "తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక విధాన సిఫార్సులకోసం సిఐఐ స్థిరంగా కృషి చేస్తోంది. మేము దృష్టి పెడుతున్న ముఖ్యాంశాలలో ఒకటి పరిశ్రమల ఇంటర్న్‌షిప్‌ల ఏకీకరణ, విద్యార్థులకు మాత్రమే కాకుండా, అధ్యాపకులకు కూడా ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయడం ద్వారా, అధ్యాపకులు పరిశ్రమ ధోరణులతో మరింత సన్నిహితంగా ఉండేలా చూస్తాము, తద్వారా అకాడెమియా, పరిశ్రమల మధ్య అంతరాన్ని భర్తీ చేయడం, ఆవిష్కరణలను నడిపించటం, దీర్ఘకాలంలో ఉపాధిని పెంచటం దీనితో  సాధ్యమవుతుంది" అని అన్నారు.