శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (20:25 IST)

మిర్చి సహకారంతో 'బీ స్పెల్‌బౌండ్' రీజినల్ ఫైనల్స్ ప్రారంభించిన ఎస్బీఐ

spell be sbilife
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ జీవిత బీమా సంస్థలలో ఒకటైన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మిర్చి సహకారంతో, హైదరాబాద్‌లో ఎస్బీఐ లైఫ్ స్పెల్ బీ 2024 - 'బీ స్పెల్‌బౌండ్' యొక్క 14వ ఎడిషన్ కోసం రీజినల్ ఫైనల్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభా వంతులైన  యువ స్పెల్లర్‌లను ఒకచోట చేర్చే ఈ పోటీ ఇప్పుడు దాని తదుపరి దశకు చేరుకుంది. హైదరాబాద్ రీజినల్ ఫైనల్‌లో హైదరాబాద్ నుండి 27 పాఠశాలల నుండి 8,425 మంది విద్యార్థులకుగాను 52 మంది విద్యార్థులు ఫైనల్‌లో పాల్గొన్నారు.
 
హైదరాబాద్‌లోని కెన్నెడీ హై ది గ్లోబల్ స్కూల్‌కు చెందిన 9 వ తరగతి విదార్థి, 13 ఏళ్ల యశ్విన్ పచౌరి తన అత్యుత్తమ స్పెల్లింగ్ సామర్థ్యం, మేథో నైపుణ్యంతో ఎస్బీఐ లైఫ్ స్పెల్ బీ 2024 యొక్క హైదరాబాద్ రీజినల్ ఫైనల్‌ను గెలుచుకున్నాడు. అతను ఇప్పుడు ఇతర నగరాల నుండి ఎంపిక చేయబడిన విజేతలతో పోటీ పడనున్నాడు. ఈ పోటీ డిసెంబర్ 24న జరుగనుంది.
 
అభిషేక్ కర్ మజుందార్, రీజనల్ డైరెక్టర్ - హైదరాబాద్ రీజియన్, ఎస్బీఐ  లైఫ్ ఇన్సూరెన్స్ ఇతర గౌరవనీయ ప్రముఖుల సమక్షంలో ఫైనలిస్టులను సత్కరించారు. ఈ సంవత్సరపు ఎడిషన్‌లో, 30 నగరాల్లోని 500 కంటే ఎక్కువ పాఠశాలల నుండి 2 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరూ 'స్పెల్‌మాస్టర్ ఆఫ్ ఇండియా 2024' ప్రతిష్టాత్మక టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. గ్రాండ్ ఛాంపియన్ రూ.1 లక్ష నగదు బహుమతితో పాటుగా డిస్నీల్యాండ్ హాంకాంగ్‌కు చిరస్మరణీయమైన పర్యటనను గెలుచుకుంటారు.
 
బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ & సీఎస్ఆర్, ఎస్బీ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ రవీంద్ర శర్మ, మాట్లాడుతూ, 'ఎస్బీఐ లైఫ్‌ వద్ద, భారతదేశ భవిష్యత్తు నాయకులకు తమ కలలు మరియు ఆకాంక్షలను కొనసాగించడానికి అధికారమివ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎస్బీఐ లైఫ్ స్పెల్ బీ 2024 పోటీ యువ ప్రతిభకు ఎదగడానికి వేదికను అందించాలనే మా నిబద్ధతను ఉదహరిస్తుంది. ఈ చిన్నారులు  కేవలం పోటీలో పాల్గొనేవారు మాత్రమే కాదు, మన దేశం యొక్క పురోగతిని నడిపించే భవిష్యత్ ఆవిష్కర్తలు, సృష్టికర్తలని మేము గుర్తించాము. వారి ప్రయాణంలో ఒక పాత్ర పోషించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము' అని అన్నారు.