శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 28 అక్టోబరు 2024 (23:08 IST)

NXP AIM 2024లో అత్యుత్తమ స్థానం పొందిన కెఎల్‌హెచ్ అజీజ్ నగర్‌కు చెందిన "బ్రెయినీ బాట్స్"

image
తమ బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులతో కూడిన "బ్రెయినీ బాట్స్" టీమ్‌ NXP AIM 2024 పోటీలో ఆకట్టుకునే రీతిలో 4వ స్థానాన్ని పొందినట్లు కెఎల్‌హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ వెల్లడించింది. ఈ పోటీలో "బ్రెయినీ బాట్స్" టీమ్‌ ప్రతిష్టాత్మక ఏఐ అర్జున అవార్డును, రూ. 10,000 నగదు బహుమతిని అందుకుంది. ఆవిష్కరణ, సమస్య పరిష్కారంలో వారి నైపుణ్యాలను ఈ అవార్డు ప్రదర్శిస్తుంది.
 
AIM NXP 2024 ఛాలెంజ్, ఒక ప్రముఖ జాతీయ పోటీ. ఏఐ, మొబిలిటీ, రోబోటిక్స్‌తో కూడిన ప్రాజెక్ట్ ఆధారిత సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులను ఆహ్వానిస్తుంది. భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల నుండి 620 కంటే ఎక్కువ జట్లతో పోటీ పడిన "బ్రెయినీ బాట్స్" బృందం అసాధారణమైన సాంకేతిక చతురతను ప్రదర్శించింది. లక్ష్మి, నౌషీన్ మరియు మేఘనతో కూడిన "బ్రెయినీ బాట్స్" బృందంకు అధ్యాపకులు మద్దతునిచ్చారు. ఉబుంటులో గెజిబో సిమ్యులేటర్‌ను వీరు ఉపయోగించారు, అధునాతన నావిగేషన్ కోసం LiDAR మరియు కెమెరా సాంకేతికతను అనుసంధానించారు.
 
సవాళ్లు, తీవ్రమైన డీబగ్గింగ్ సెషన్‌లను అధిగమిస్తూ ఈ టీమ్ సిమ్యులేషన్ ఫేజ్ అధిగమించింది. బిట్స్ పిలానీ హైదరాబాద్‌లో ప్రాంతీయ ఫైనల్స్‌కు చేరుకుంది. వారి స్థిరమైన ప్రదర్శన వారిని నోయిడాలో గ్రాండ్ ఫినాలేకి ఎంపికయ్యేలా చేసింది, అక్కడ వారు తమ బగ్గీని మరింత మెరుగుపరిచి అగ్ర పోటీదారులలో 4వ స్థానాన్ని పొందారు. NXP యొక్క విపి, శ్రీ హితేష్ గార్గ్ హాజరైన అవార్డుల వేడుకతో పోటీ ముగిసింది.
 
కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. జి. పార్ధ సారధి వర్మ, టీమ్ సాధించిన విజయాల పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, "మా ఇసిఇ బృందం యొక్క అత్యుత్తమ ప్రదర్శన మా సంస్థకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన విలువలైన ఆవిష్కరణ, స్థిరత్వం మరియు శ్రేష్ఠత పట్ల అచంచలమైన నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది దేశంలోని అగ్రశ్రేణి సంస్థల విద్యార్థులతో పోటీపడి సాధించిన వారి విజయం మా విద్యార్థుల సామర్థ్యానికి మరియు అంకితభావానికి నిదర్శనం.." అని అన్నారు.