1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (17:48 IST)

అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పాప పేరు ఎవారా.. అర్థం ఏంటంటే?

KL Rahul
KL Rahul
స్టార్ కపుల్ అతియా శెట్టి- కెఎల్ రాహుల్ తమ నవజాత కుమార్తెకు ఎవారా అని పేరు పెట్టారు. ఎవారా అంటే "దేవుని బహుమతి"అని అర్థం. అతియా-రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ కుమార్తె పేరును వెల్లడించారు. అతియా కుమార్తెపై ప్రేమగా చూస్తుండగా, కుమార్తెను రాహుల్ ఎత్తుకుని కనిపించాడు. 
 
"మా ఆడబిడ్డ, మా సర్వస్వం. ఎవారా భగవంతుని బహుమతి." అని రాహుల్ రాశారు. శుక్రవారం రాహుల్ 33వ పుట్టినరోజు సందర్భంగా వారిద్దరు తమ కుమార్తె పేరును వెల్లడించారు. అతియా కూడా తన భర్తకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా రాసింది.. "పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ, మేము నిన్ను మాటలకు, ప్రపంచాలకు అతీతంగా ప్రేమిస్తున్నాము." అని తెలిపింది. 
Athiya Shetty
Athiya Shetty
 
ఇదిలా ఉండగా.. కేఎల్ రాహుల్-అతియా శెట్టి దంపతులు మార్చి 24న తల్లిదండ్రులయ్యారు. అతియా శెట్టికి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి హర్షం వ్యక్తం చేశారు. మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందన్నారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు జనవరి 23, 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.