బుధవారం, 22 అక్టోబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (18:59 IST)

Abhishek Sharma: కాశ్మీరీ అమ్మాయి ప్రేమలో బర్త్ డే అండ్ చాక్లెట్ బాయ్ అభిషేక్ శర్మ

Abhishek Sharma
Abhishek Sharma
భారత క్రికెట్ యువ సంచలనం, పంజాబ్‌కు చెందిన ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఒక కాశ్మీరీ ముస్లిం అమ్మాయి కోసం పరితపిస్తున్నాడట. ఆ యువతి పేరు లైలా ఫైసల్. అభిషేక్ శర్మ తరచుగా ఢిల్లీలో జరిగే ఈవెంట్లలో లైలాతో కలిసి కనిపిస్తున్నాడు. లైలా ఒక మోడల్‌గా కనిపించినా.. ఆమె నిజానికి ఒక ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్. 
 
లండన్‌లో పెరిగిన లైలా, ఒక సంపన్న వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, లైలా పేరు ఒక క్రికెటర్‌తో ముడిపడటం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు అభిషేక్ శర్మ, తానియా సింగ్ అనే మోడల్‌తో ప్రేమలో వున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మోడల్ ఫిబ్రవరి 2024లో సూరత్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.
 
ఇకపోతే.. 2018లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో అభిషేక్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆరంభ ఆటగాడిగా బరిలోకి దిగి తన ఎడమచేతి వాటం బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తన అద్భుతమైన ఫామ్‌తో 2024లో జింబాబ్వే పర్యటనకు ఎంపికై, అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం దక్కించుకున్నాడు.
 
అలాగే సెప్టెంబర్ 4, 2004న అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్ శర్మ, తన అసాధారణమైన బ్యాటింగ్‌తో భారత క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఈ రోజు తన 25వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.