1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 మే 2025 (14:02 IST)

లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో ధోనీ, కపిల్- భారత సైన్యం నుంచి పిలుపు వచ్చిందా?

Dhoni
పాకిస్థాన్‌తో యుద్దం నేపథ్యంలో భారత సైన్యానికి సాయం అందించాలంటూ ప్రాదేశిక సైన్యానికి పిలుపు అందింది. ఈ ప్రాదేశిక సైన్యంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో టీమిండియా మాజీ కెప్టెన్‌లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్ ఉండగా.. మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలెట్ కూడా ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాలో కొనసాగుతున్నారు. 
 
మహేంద్ర సింగ్ ధోనీకి 2011లో భారత ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది. ఇది క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా దక్కింది. ప్రాదేశిక సైన్యంలో ధోనీ గౌరవ హోదాలో ఉన్నందున, అవసరమైతే అతన్ని కూడా విధులకు పిలిచే అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా ధోనీకి భారత సైన్యం నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. 
 
ధోనీ తరహాలోనే క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా కపిల్ దేవ్‌కు కూడా భారత ప్రాదేశిక సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలెట్.. ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదా కలిగి ఉన్నారు.