గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2024 (21:08 IST)

కోహ్లీకి కోపం వచ్చింది.. మహిళా రిపోర్ట్‌పై చిందులు.. వీడియో వైరల్

Kohli
Kohli
క్రికెట్ మైదానంలో తన ఆటతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా మీడియాపై రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తన కుటుంబం ఫోటోలు తీయడంపై కోహ్లీ కోపగించుకోవడం సంచలనం సృష్టించింది.
 
తన కుటుంబ సభ్యులు, పిల్లలను మీడియా కెమెరాలు చిత్రీకరిస్తున్నప్పుడు అసహనానికి లోనయ్యారు. తొలుత మీడియా ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్‌ను ఇంటర్య్వూ చేస్తుండగా, కుటుంబ సభ్యులతో కలిసి కోహ్లీ ఎయిర్‌పోర్టుకు రావడంతో మీడియా మొత్తం కూడా అతని వెనుక పరిగెత్తింది. 
 
ఓ మహిళ రిపోర్టర్ కోహ్లీ కుటుంబ సభ్యులను ఫొటోలు తీయడానికి అత్యుత్సాహం చూపారు. దీంతో ఆ చానెల్‌కు సంబంధించిన మహిళ రిపోర్టర్‌పై మండిపడ్డారు. 
 
ఆయన పిల్లలను ఫొటోలు తీయలేదని హామీ ఇచ్చిన తర్వాత కానీ కోహ్లీ శాంతించలేదు. ఆ హామీ తర్వాత, కోహ్లి చానెల్ 7 కెమెరామన్‌తో చేతులు కలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.