బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (15:17 IST)

వచ్చేస్తున్నా భగవంతుడా అంటూ భవనం పైనుంచి దూకేశాడు (video)

ప్రకాశం జిల్లా గిద్దలూరులో విషాదకర సంఘటన జరిగింది. తనను దేవుడు రమ్మని పిలుస్తున్నాడంటూ ఓ వృద్ధుడు ఆసుపత్రి భవనం పైనుంచి కిందికి దూకేశాడు. దీనితో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఈ వృద్ధుడు గాయపడ్డాడు. దీనితో అతడిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఐతే వున్నట్లుండి తనను దేవుడు పిలుస్తున్నాడంటూ తోటి రోగులతో చెప్పడం ప్రారంభించాడు. వాళ్లు అతడు చెప్పే మాటలను ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసేలోపుగానే... వచ్చేస్తున్నా భగవంతుడా అంటూ ఆసుపత్రి భవనం పైనుంచి కిందికి దూకేశాడు. ఇదంతా సీసీ కెమేరాలో రికార్డయ్యింది.