శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జులై 2024 (14:28 IST)

ఆరేళ్ల బాలికపై వృద్ధుడు అఘాయిత్యం...

victim woman
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీన్ని చూసిన స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, తప్పించుకుని పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు నార్లవలసో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. చిన్నారిని ఊయలలో వేసిన తల్లి కిరాణషాపుకు వెళ్లడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నార్లవలసకు చెందిన బోయిన ఎరకన్న దొర పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడికి చేరుకున్న ఆమె అక్క తల్లికి విషయం చెప్పింది. విషయం గ్రామస్థులకు తెలియడంతో అందరూ కలిసి వృద్ధుడిని వెంబడించారు. అయినప్పటికీ వారికి చిక్కకుండా తప్పించుకున్నాడు. 
 
మరోవైపు, తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా కేంద్రం విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పాప కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నార్లవలసలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.