1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 1 మే 2025 (21:04 IST)

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

Liquor Bottles
బెట్టింగులు (Betting), జూదాలు అనేవి వ్యసనాలు. ఇవి తలకెక్కితే ప్రాణం పోతుందన్న స్పృహ కూడా వుండదు. పోటీలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఎంతటికైనా తెగిస్తుంటారు. అలాంటిదే కర్నాటక (Karnataka)లోని కోలారు (Kolar) జిల్లా ముల్బగల్‌లో చోటుచేసుకున్నది.
 
పూర్తి వివరాలు చూస్తే... కార్తీక్ అనే 21 ఏళ్ల యువకుడు కార్తీక్ (Karthik) తన స్నేహితులతో ఓ బెట్టింగ్ కట్టాడు. నీళ్లు కలపకుండా 5 ఫుల్ మద్యం బాటిళ్లను (5 liquor bottles) ఒక్కసారిగా తాగేస్తానన్నాడు. నిజమా... అంటూ అతడి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. ఐతే అలా తాగితే తాము రూ. 10,000 ఇస్తామంటూ కార్తీక్ ముందు సవాల్ విసిరారు.
 
అంతే.. కార్తీక్ పోటీకి దిగాడు. 5 బాటిళ్ల మద్యాన్ని గటగటా తాగేసాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటూ గిలగిలా కొట్టుకోసాగాడు. దాంతో అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక అతడు మృతి చెందాడు. ఈ పందేన్ని కార్తీక్ ముందు వుంచిన అతడి స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేసారు. కాగా కార్తీక్ కి గత ఏడాది పెళ్లయ్యింది. 8 రోజుల క్రితం అతడి భార్య బిడ్డకు జన్మనిచ్చింది. ఈలోగా ఈ విషాద ఘటన జరిగింది.