బుధవారం, 10 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 డిశెంబరు 2025 (13:49 IST)

బస్సులో వున్న ఆ అమ్మాయిని మాకు అప్పగించి వెళ్లు: డ్రైవర్‌కి గంజాయ్ బ్యాచ్ డిమాండ్

Men
గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసలైన కొందరు యువకులు దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు. కర్నాటక లోని కిక్కేరి తాలూకాలో మద్యం, గంజాయి మత్తులో ఇద్దరు వ్యక్తులు స్కూలు బస్సుకు అడ్డంగా తమ ద్విచక్ర వాహనాన్ని ఆపారు. ఆ తర్వాత స్కూలు బస్సులో వున్న తమకు కావాల్సిన అమ్మాయిని అప్పగించి వెళ్లు అంటూ బస్సు డ్రైవరును బెదిరించారు.
 
ఐతే బస్సు డ్రైవర్ ఎంతమాత్రం భయపడకుండా వారిని ఎదిరించాడు. పిల్లల్ని సురక్షితంగా స్కూలు వద్ద దింపాడు. గుర్తు తెలియని ఆ ఇద్దరు వ్యక్తులను వీడియో తీయడంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.