బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జనవరి 2025 (09:24 IST)

నెలకు రూ.1.10 లక్షల వేతనం... డబ్బు కోసం సహోద్యోగి ఇంటిలో చోరీ!!

robbery
అతనో ఐటీ ఉద్యోగి. నెలకు రూ.1.10 లక్షల వేతనం. హైదరాబాద్ మహానగరంలో సొంతిల్లు కూడా ఉంది. కానీ, అతనికి వచ్చే వేతనం సరిపోలేదు. జల్సాల కోసం పక్కదారి పట్టాడు. దీంతో దొంగగా అవతారమెత్తి, సహోద్యోగి ఇంటిలో చోరీకి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడజి చేసి గాయపరిచాడు. ఆమె చేతులకు ఉన్న బంగారు గాజులతో ఉడాయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, మాదాపూర్ ఠాణా డీఐ విజయ్ నాయక్ వివరాల మేరకు.. ఖాజీపేటవాసి కళాహస్తి హరీశకృష్ణ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగి. గాజులరామారంలో నివాసం ఉన్నాడు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నాడు. బెట్టింగులు, జల్సాలకు అలవాటు పడి అప్పులు చేశాడు. వచ్చే జీతం జల్సాలకు, అప్పులకు సరిపోక చోరీలు చేస్తున్నాడు.
 
వాట్సాప్ గ్రూప్‌లో సమాచారంతో తన కంపెనీలోని ఉద్యోగి కేవీ.మణికంఠ హరీశకృష్ణకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు మిగతా ఉద్యోగులతో కలిసి ఖాళీ సమయాల్లో క్రికెట్ ఆడేవారు. ఈ ఆటగాళ్లకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈక్రమంలో మాదాపూర్ చంద్రానాయక్ండాలో ఉన్న మణికంఠ ఇంటికి హరీశకృష్ణ పలుసార్లు వెళ్లాడు. 
 
ఈ క్రమలో డబ్బు కోసం అతని ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. వాట్సాప్ గ్రూపులో చాటింగ్ ద్వారా ఈ నెల 25న మణికంఠ ఇంట్లో ఉండటం లేదని తెలుసుకుని హరీశకృష్ణ ఉదయం 11.15 గంటలకు ముఖానికి ముసుగు, తలకు హెల్మెట్ ధరించి ఇంట్లోకి వెళ్లి 18 నెలల పాపతో ఉన్న మణికంఠ భార్యకు కత్తిని చూపి ఒంటిపై ఉన్న నగలివ్వకుంటే చంపేస్తాననడంతో ఆమె ప్రతిఘటించే క్రమంలో ఆమె చేతికి కత్తి గాయమైంది. 
 
ఇదే అదునుగా ఆమె చేతి గాజులు లాక్కొని పారిపోయాడు. అదే రోజు మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా హరీశ కృష్ణపై అనుమానం రాగా అదుపులోకి తీసుకొని సెల్ఫోన్ పరిశీలించగా గాజులను ఓ దుకాణంలో విక్రయించినట్లు రసీదు ఫోనులో కనిపించింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి 20 గ్రాముల గాజులు, దోపిడీకి ఉపయోగించిన ద్విచక వాహనం. కతి. ఒక సెల్‌ఫోనులో స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.