శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (13:38 IST)

నలుగురు వికలాంగ కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. ఎక్కడ?

suicide
వికలాంగులు అయిన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఢిల్లీలో జరిగింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగువారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి ఇంటి తలుపులు తెరవగా ఈ విషయం బయటపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వారందరూ విషం సేవించి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటి నుంచి దుర్వాస రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లి చూసి షాకయ్యారు. ఐదుగురి మృతదేహాలు ఒకదాని పక్కన ఒకటి పడివున్నాయి. మూడు రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. 
 
ఇంటి పెద్ద వయసు 50 యేళ్ళుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వసంత్ కుంజ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతడు కార్పెంటర్‌గా పనిచేస్తూ రంగపురి గ్రామంలో ఉంటున్నారు. ఆ కుటుంబం బీహార్ రాష్ట్రంలోని చాప్రా నుంచి ఢిల్లీకి వలస వచ్చింది. పిల్లల తల్లి కొన్నేళ్ల క్రితమే కేన్సర్‌తో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.