శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 ఆగస్టు 2024 (13:08 IST)

విజయవాడ నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమజంట, ఎక్కడ చిక్కారంటే?

విజయవాడలోని భవానీపురంకి చెందిన ప్రేమికులు ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయిన జంటను తిరుపతిలోని తిరుచానూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురంకి చెందిన అలేఖ్య రెండు రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అలేఖ్య తిరుపతి తిరుచానూరులో వున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
దాంతో పోలీసులు ప్రేమికులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా తామిద్దరం గత 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామనీ, మేజర్లమైన తామిద్దరం ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు పోలీసులకు తెలియజేసారు. తమకు పోలీసులు రక్షణ కల్పించాలంటూ వారు విజ్ఞప్తి చేసారు. కాగా వీరిద్దర్ని భవానీపురం పోలీసు స్టేషనులో అప్పగించనున్నట్లు తిరుచానూరు సీఐ వెల్లడించారు.