సోమవారం, 15 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2025 (22:49 IST)

స్నానం చేస్తుండగా కోడలిని వీడియో తీసిన మామ, బావ

Woman
భాజపా ఎంపి ముఖేష్ రాజ్ పుత్ సోదరి రీనా సింగ్ తనకు ఎదురైన దారుణ ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసారు. తను స్నానం చేస్తుండగా తనను తన మామయ్య, తన బావ ఇద్దరూ వీడియో తీసారంటూ రీనా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అఘాయిత్యంపై ప్రశ్నించినందుకు తన మామ తనను కర్రతో కొట్టి చంపేస్తానంటూ బెదిరించాడనీ, తన బావ తనపై ఇనుప రాడ్డుతో దాడి చేసేందుకు వచ్చాడనీ, జుట్టు పట్టుకుని లాగాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.
 
తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా రీనా సింగ్ తమపై దాడి చేసిందంటూ అంతకుముందే అత్తమామలు ఆమెపై కేసు పెట్టారు.