గురువారం, 13 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 నవంబరు 2025 (12:45 IST)

తల్లిని - తమ్ముడిని కత్తితో నరికి చంపిన మతిస్థిమితం లేని వ్యక్తి

murder
సమాజంలో మానవ సంబంధాలు మంటకలసిపోతున్నాయి. రక్త సంబంధాలకు ఏమాత్రం విలువనివ్వడం లేదు. ఫలితంగా దారుణ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా మతిస్థిమితం లేని వ్యక్తి ఒకరు కన్నతల్లితో పాటు సోదరుడిని అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపేశాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని సుంకరపద్దయ్య వీధిలో జరిగింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... గునుపూడి శ్రీనివాసరావుకు మానసికస్థితి సరిగా లేదు. అతని తల్లి మహాలక్ష్మి(60), తమ్ముడు రవితేజ(33)తో కలిసి ఉంటున్నాడు. శ్రీనివాసరావుకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు.
 
సోమవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా శ్రీనివాసరావు తల్లి, తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేసేలోపు కిరాతకంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం ఓ గంట తర్వాత శ్రీనివాసరావే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు.