శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

మార్ట్‌లో పని చేసే యువతిపై సూపర్‌వైజర్ అఘాయిత్యం... ఎక్కడ?

victim girl
ఓ మార్ట్‌లో తన కింద పనిచేసే అవివాహిత (యువతి)పై అక్కడే పని చేసే సూపర్ వైజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఘట్‌కేసర్ ప్రాంతానికి చెందిన ఖాజా బషీర్ (35) అనే వ్యక్తి ఓ మార్ట్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. అదే మార్ట్‌లో తన కింద 20 యేళ్ల ఓ యువతి పని చేస్తుంది. ఆమె వాష్‌రూమ్‌కు వెళ్లగా బషీర్ వెనుకనే వెళ్లి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. పైగా, ఈ దారుణం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం యువతి మార్ట్‌లో కళ్లుతిరిగి పడిపోయాడు. ఆ వెంటనే మార్ట్ నిర్వాహకులు యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు పరీక్షించి, గర్భందాల్చినట్టు వెల్లడించారు. దీంతో నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు నిలదీయంతో జరిగిన విషయాన్ని వెల్లడించింది. ఖాజా బషీర్ లైంగికదాడికి పాల్పడినట్టు బోరున విలపిస్తూ వెల్లడించింది. దీంతో తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు మార్ట్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... బషీర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.