శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (19:43 IST)

బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం: 15మంది మృతి.. వందమందికి గాయాలు

Train Accident
Train Accident
బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోయారు.  100మందికి పైగా గాయాల పాలైనారు. దీంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని, మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. 
 
బైరబ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఓ గూడ్స్ రైలు... ప్రయాణికులతో కూడిన మరో రైలు పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు ఉన్న రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన ప్రాంతం ఢాకాకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది.