దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2025: 30 రోజుల పాటు కదలడానికి, కనెక్ట్ అవ్వడానికి ప్రపంచవ్యాప్త ఆహ్వానం
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2025 తిరిగి వచ్చింది, ఇది నగరంలోని ప్రతి ఒక్కరూ చురుకుగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఫిట్‌నెస్‌ను జీవన విధానంగా మార్చడానికి స్ఫూర్తినిస్తుంది. 2025 నవంబర్ 1 నుండి 30 వరకు జరిగే ఈ తొమ్మిదవ ఎడిషన్, నివాసితులు, సందర్శకులను దుబాయ్ 30x30 ఉద్యమం- 30 రోజుల పాటు ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామానికి కట్టుబడి ఉండటంలో చేరమని ఆహ్వానిస్తుంది.
మీరు యోగా, సైక్లింగ్, రన్నింగ్, HIIT, స్విమ్మింగ్ లేదా పాడెల్‌లో ఉన్నా, దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ (DFC) అందరికీ ఏదో ఒకటి అందిస్తుంది. విస్తృత శ్రేణిలో ఉచిత వ్యాయామాలు, గ్రూప్ సెషన్‌లు, వెల్‌నెస్ ఈవెంట్‌లను నగరం నిర్వహిస్తుంది. దుబాయ్ అంతటా ఫిట్‌నెస్ విలేజ్‌లు, కమ్యూనిటీ హబ్‌లు నిపుణులైన శిక్షకుల నేతృత్వంలో వేలాది తరగతులను అందిస్తాయి. ప్రధాన ఈవెంట్‌లలో మై దుబాయ్ నిర్వహించే దుబాయ్ రన్(నవంబర్ 23)- RTA ప్రదర్శించే దుబాయ్ స్టాండ్-అప్ ప్యాడిల్ (నవంబర్ 8–9), దుబాయ్ యోగా (నవంబర్ 30) వంటివి వున్నాయి.
అదనంగా, DFC 2025 దుబాయ్ ప్రీమియర్ పాడెల్ P1(నవంబర్ 9-16), దుబాయ్ T100 ట్రయాథ్లాన్ (నవంబర్ 15-16), DP వరల్డ్ టూర్ ఛాంపియన్‌షిప్ (నవంబర్ 13-16), బేస్‌బాల్ యునైటెడ్ సీజన్ వన్(నవంబర్ 25–26), ఐకానిక్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ దుబాయ్ రగ్బీ సెవెన్స్ (నవంబర్ 28-30) వంటి ప్రపంచ స్థాయి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను కూడా కలిగి ఉంటుంది. ఈ ప్రపంచవ్యాప్త కార్యక్రమాలు క్రీడ, ఆరోగ్యం మరియు వెల్నెస్‌కు ప్రధాన గమ్యస్థానంగా దుబాయ్ యొక్క పెరుగుతున్న ఖ్యాతిని నొక్కి చెబుతున్నాయి.
ఆరోగ్యకరమైన మీ కోసం మొదటి అడుగు వేయడానికి ఇది సరైన సమయం. మీరు నడిచినా, పరుగెత్తినా, సైకిల్ తొక్కినా, తెడ్డు వేసినా లేదా యోగా సాధన చేసినా - ప్రతి కదలిక లెక్కించబడుతుంది. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ వెబ్ సైట్లో ఉచితంగా నమోదు చేసుకోండి, మీ ఛాలెంజ్‌ను కనుగొనండి.