శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2025 (16:11 IST)

ఉద్యోగం ఊడిపోయింది.. అద్దెకు స్నేహితుడయ్యాడు.. రూ.69 లక్షలు సంపాదించాడు..

Rental Friend
Rental Friend
అద్దెకు స్నేహితుడిగా వెళ్లిన ఓ వ్యక్తి రూ.69 లక్షలు సంపాదించాడు. ఈ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన జోషి మోరీ మోటో అనే వ్యక్తి గత 2018వ సంవత్సరం ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. దీంతో ఇక ఉద్యోగాలను నమ్మి ప్రయోజనం లేదనుకున్న అతను కొత్త ఐడియాను ఆచరణలో పెట్టాడు. దాని ప్రకారం ఒంటరిగా వున్నవారిని ఆదుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా అద్దెకు స్నేహితుడిగా మారడం ద్వారా 80వేల అమెరికా డాలర్లు సంపాదించాడు. 
 
ఒంటరిగా వున్న వాళ్లతో మాట్లాడటం కోసమే అతను అద్దెకు వెళ్తాడు. ఇలా బాగా పాపులర్ అయ్యాడు. ఇంకా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు మాటలు కలపడం, వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడటం, మ్యూజికల్ ప్రోగ్రామ్‌కు వెళ్లే వారికి స్నేహితుడిగా తోడు వెళ్లడం వంటి సేవలు చేసేవాడు. 
 
అయితే ప్రేమతో పాటు లైంగిక సంబంధిత కార్యకలాపాలకు దూరంగా వున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మండే ఎండల్లో నిలబడటం.. గడ్డకట్టే మంచులో నిలబడిన సందర్భాలున్నాయని.. అయితే రెండు లేదా మూడు గంటలకు రూ.17వేలను ఫీజుగా పొందుతున్నానని చెప్పుకొచ్చాడు.