శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (10:19 IST)

గాజా పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ వైమానికి దాడి.. 20 మంది మృతి

school building blast
సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ సైన్యం జరిగిన వైమానిక దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది మృత్యువాతపడ్డారు. అదో రోజు జరిగిన దాడిలో నుసిరత్‌లో ఇద్దరు మహిళలు కూడా మరణించారు. పాఠశాల భవనంపై జరిపిన దాడిలో పలువురు పాఠశాల విద్యార్థులతోపాటు మహిళలు కూడా అధికంగా ఉన్నారు. ఈ దాడిలో చనిపోయినవారి మృతదేహాలను నుసైరత్‌‍లోని అల్ ‍‌అవ్డా ఆస్పత్రికి, డీర్ అల్ బలాహ్‍‌లోని అల్‌ అక్సా ఆస్పత్రికి తరలించామని సదరు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు, ఇజ్రాయెల్ సెంట్రల్ గాజాపై వైమానికి దాడి చేయగా మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‍ను టార్గెట్ చేసుకుని హిజ్‌బుల్లా డ్రోన్ దాడి చేసింది. ఈదాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కాగా, గత కొంతకాలంగా పశ్చిమాసియా దేశంలో రోజు రోజుకూ యుద్ధం తీవ్రతరమవుతున్న విషయం తెల్సిందే.