శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (16:20 IST)

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు- మారణకాండలో 107 మంది మృతి

Lebanon
Lebanon
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరుగుతూనే వున్నాయి. ఆదివారం నాడు వరుస బాంబు దాడుల్లో హిజ్బుల్లా గ్రూపుకు చెందిన 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. సిడాన్ సమీపంలో జరిగిన ఘోరమైన వైమానిక దాడిలో 107 మంది మరణించారు. ఈ ఘటనలో ఏకంగా 359 మంది గాయపడ్డారు. 
 
ఇరాన్ మద్దతుగల సాయుధ గ్రూప్ హిజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్ ఆదివారం ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించారు. బృందం అతని మరణాన్ని ధృవీకరించింది. కౌక్‌తో పాటు, గ్రూప్‌లోని 7 మంది కీలక కమాండర్లు ఒక వారంలో ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
 
ఇకపోతే.. గత రెండు వారాలలో, ఈ యుద్ధంలో 1,030 మంది మరణించారు. వీరిలో 156 మంది మహిళలు, 87 మంది పిల్లలు ఉన్నారు. 
 
దీంతో పాటు, లక్షలాది మంది తమ ఇళ్లను కోల్పోయారు. 2.5 లక్షల మంది షెల్టర్ హోమ్‌లలో ఉండగా, 10 లక్షల మంది తమ బంధువుల ఇళ్లలో నివసిస్తున్నారు అని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.