శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2024 (19:08 IST)

మీలాంటి వారు ఎవరూ లేరు నాన్నా : దుబాయ్ యువరాణి

Dubai Princess
ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్న చందంగా దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ పిల్లలకు మాత్రం నాన్నే... అని చాటి చెప్పారు.. దుబాయ్ యువరాణి. షేక్ లతీఫా ఎంఆర్ఎల్ మక్తూమ్. తన తండ్రి యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ద బిన ర్షీద్ అల్ మక్తూమ్ పట్ల తనకున్న ప్రేమను ఆమె మరోమారు తెలియజేశారు. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా శుక్రవారం నాడు అరబిక్ భాషలో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. 
 
మీ లాంటి వారు ఎవరూ లేరు నాన్నా అనే క్యాప్షన్‌తో మనసును హత్తుకునే ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని చాటిచెప్పే కొన్ని సన్నివేశాలు ఈ వీడియోలో కనిపించాయి. కాగా, ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే వైరల్ కావడం గమనార్హం. భారీ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. 
 
మరోవైపు, దుబాయ్ యువరాణి పోస్టుపై పలువురు నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. తండ్రీ-కూతుళ్ల బంధాన్ని ఈ వీడియో తెలియజేస్తోందని పలువురు పేర్కొన్నారు. గొప్ప నాయకుడికి గర్వకారణమైన కూతురు ఆమె అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. 'గొప్ప ప్రపంచ నాయకుడు, అద్భుతమైన తండ్రి. ఆయన కేవలం తన పిల్లలకు మాత్రమే తండ్రి కాదు, మనలో చాలా మందికి కూడా తండ్రిలాంటి వారు' అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు.