శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (18:37 IST)

జనరల్‌గా హీరోయిన్‌కి స్పేస్ ఉండదు - పర్సనల్‌గా నాకు రాకెట్ ఇష్టం: రుక్మిణి

Rukmini Vasanth
Rukmini Vasanth
బఘీర సినిమాలో నా క్యారెక్టర్ దీపం తో పోల్చవచ్చు. పర్సనల్ గా అయితే నాకు రాకెట్ ఇష్టం. దీపావళి రోజున ఇంట్లో ఫ్యామిలీ అందరితో కలిసి గడపడం నాకు చాలా ఇష్టం అని నాయిక రుక్మిణి వసంత్ అన్నారు.
 
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బఘీర'తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించారు. ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రుక్మిణి వసంత్ సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
- జనరల్ గా యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్ కి స్పేస్ ఉండదు అని చెప్తుంటారు. కానీ ఇందులో అలా కాదు. నా క్యారెక్టర్ కి చాలా ప్రిఫరెన్స్ ఉంది. ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కి చాలా వెయిట్ ఉన్న కథ ఇది.
 
-ప్రశాంత్ నీల్ గారి పేరు చూడగానే ఆడియన్స్ లో కచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. అయితే మా డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు ..ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాకు వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ లో వుండే ఎలిమెంట్స్ ఇందులో అద్భుతంగా కుదిరాయి. ప్రశాంత్ నీల్ గారి కథతో మా డైరెక్టర్ సూరి గారు తనదైన ఒక విజన్ క్రియేట్ చేశారు.
 
-శ్రీమురళి వండర్ ఫుల్ కోస్టార్. బ్రిలియంట్ యాక్టర్. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంటుంది.
 
-అజినీస్ లోక్ నాథ్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్ అద్భుతంగా వుంటుంది. ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు.  
 
- నిజానికి అలాంటి అవకాశాలు రావడం నా అదృష్టం. ఇప్పటి వరకు నా దగ్గరికి చాలా మంచి కథలు వచ్చాయి. చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. సప్త సాగరాలు సినిమా తర్వాత నాకు చాలా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్స్ రావడం మొదలైంది. నేను అంత ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్లు చేయగలని ఫిలిం మేకర్స్ నమ్మకం ఉంచడం అదృష్టంగా భావిస్తున్నాను.
 
- మా ఇంట్లో చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా అమ్మగారు ఎంతగానో ప్రోత్సహించారు.  మా అమ్మగారికి కళల పట్ల మంచి అభిప్రాయం ఉంది. నా థియేటర్ జర్నీ మా మదర్ తోనే స్టార్ట్ అయింది.  మై మదర్ ఈజ్ మై సపోర్ట్ సిస్టం. నా కెరియర్ స్టార్టింగ్ లో అన్ని స్క్రీన్ టెస్ట్లకి మా అమ్మగారే వచ్చేవారు. ఒకసారి లండన్ కూడా తీసుకెళ్లారు. ఫ్యామిలీ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉంది.