శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (11:37 IST)

మెటా ఉద్యోగులకు లే-ఆఫ్.. ఈ ఏడాది ఆ సంఖ్య తక్కువే

Meta
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, రియాలిటీ ల్యాబ్‌లతో సహా అనేక విభాగాలలో మెటా ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ తొలగింపులు పే స్కేల్‌లో తక్కువగా ఉన్నవారికే వర్తిస్తుందని మెటా తెలిపింది. మెటా రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ఉద్యోగుల తొలగింపు కొత్త కాదు. 
 
ఇప్పటికే 2022లో కంపెనీ 11,000 మంది ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించిన మెటా.. 2023లో పదివేల మందిని ఇంటికి పంపింది. అయితే ఈ ఏడాది ఈ సంఖ్య తక్కువ స్థాయిలో వుండటం గమనార్హం. ఇప్పటికే మెటా నుంచి లేఆఫ్‌కు గురైనట్లు కొందరు ఉద్యోగులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. 
 
అయితే వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ లే ఆఫ్ ప్రభావం వుంటుందని టాక్. దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాల్లో మార్పుల కారణంగానే ఉద్యోగులను తొలగించే ప్రక్రియ జరుగుతోందని మెటా పేర్కొంది. మెటా నుంచి ఉద్వాసన పలికిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ అవకాశాలు అందించేందుకు కంపెనీ ప్రయత్నం చేస్తున్నట్లు మెటా అధికారి తెలిపారు.