శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 18 డిశెంబరు 2024 (19:24 IST)

ఆండ్రాయిడ్ 15 ద్వారా మద్దతు చేయబడే నథింగ్ OS 3.0 ప్రారంభం

Nothing OS 3.0
ఆండ్రాయిడ్ 15 ద్వారా మద్దతు చేయబడిన నథింగ్ OS 3.0 (NOS 3.0), లండన్ కి చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్, నథింగ్ ఈ రోజు ప్రకటించింది. నథింగ్ యొక్క సిగ్నేచర్ గుర్తింపుకు చిహ్నంగా రూపొందించబడిన NOS 3.0 మరింత అనుకూలమైన, భాగస్వామ పరస్పర ప్రతిచర్యల కోసం మార్గాన్ని ఏర్పరుస్తూ యూజర్ అనుభవాన్ని పెంచడానికి గాను కొత్త ఫీచర్లు, మెరుగుదలలను పరిచయం చేసింది.
 
వినూత్నమైన ఫీచర్లతో నిండిన NOS 3.0 ఆధునిక సెర్చ్ ఫంక్షన్, విస్తరించబడిన ఎడిటింగ్ సాధనాలైన ఫిల్టర్స్, మార్క్ అప్స్, సూచనలు సహా కొత్త నేటివ్ ఫోటో గాలరీ యాప్‌ను పరిచయం చేసింది. ఈ అప్ డేట్ యూజర్లకు కనక్ట్ అయి ఉండే కొత్త మార్గాలను అందిస్తోంది, కొత్తగా రూపొందించబడిన, పూర్తి అనుకూలమైన లాక్ స్క్రీన్ పై షేర్డ్ విడ్గెట్స్ ద్వారా స్నేహితులు, కుటుంబంతో పరస్పరం భాగస్వామానికి అవకాశం ఇస్తుంది. మెరుగుపరచబడిన ఉత్పాదక విడ్గెట్స్ అయిన కొత్త కౌంట్ డౌన్ విడ్గెట్ వంటి వాటి పైన యూజర్లు ట్రాక్‌లో ఉండటానికి అనుమతిస్తుంది, AI-మద్దతు గల స్మార్ట్ డ్రాయర్ మరింత సమర్థవంతమైన నిర్వహణ, యాక్సెస్ కోసం యూజర్లు ఆటోమేటిక్‌గా తమ యాప్స్‌ను ఫోల్డర్స్ లోకి వర్గీకరించడానికి యూజర్లకు వీలు కల్పిస్తుంది.
 
NOS 3.0 ఈ కింది అదనపు అప్ డేట్స్ ను మరియు మెరుగుదలలను కలిగి ఉంటుంది:
మెరుగుపరచబడిన పాప్-అప్ వ్యూ
మెరుగుపరచబడిన శీఘ్ర సెట్టింగ్స్
దృశ్యపరమైన, పెర్ఫార్మెన్స్ మెరుగుదలలు
అప్ డేట్ చేయబడిన టైపోగ్రఫి.