శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (10:59 IST)

JEE Main Result 2023 Session 2: టాపర్‌గా హైదరాబాదీ విద్యార్థి

జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. 
 
మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు తదుపరి పరీక్షకు ఏప్రిల్ 30 నుంచి మే 7లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. జూన్ 4న అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుండగా ఫలితాలను అదే నెల 18న విడుదల చేస్తారు. 
 
ఇక జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 6 నుంచి 15 వరకూ రెండవ సెషన్ పరీక్షలు జరిగాయి. ఈసారి మొత్తం 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. హైదరాబాద్‌కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య 300/300 స్కోర్‌తో మెయిన్ టాపర్‌గా నిలిచాడు.
 
నెల్లూరుకు చెందిన పి.లోహిత్ ఆదిత్య సాయి 2వ ర్యాంకు సాధించాడు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సాయి దుర్గారెడ్డి 6వ ర్యాంకు దక్కించుకున్నాడు.