శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 24 జూన్ 2023 (23:35 IST)

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ను సంగీత సాగరంలో ఓలలాడించిన ముజిగల్ అకాడమీ

image
ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రతిభను పెంపొందించడానికి అంకితమైన ప్రముఖ సంగీత శిక్షణా సంస్థ అయిన ముజిగల్ అకాడమీ, ఒక విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయకులు సాయి శ్రీచరణ్, సాయివల్లి శివాని పాల్గొని మంత్రముగ్ధులను చేసే సంగీత కచేరీని చేశారు. వీరితో పాటుగా, ఓపెన్ మైక్ సెషన్లో సరేగమప విజేతలు, గాయకులు వాగ్దేవి, శశాంక్‌ల సమక్షంలో సాయంత్రం సంగీత వైభవానికి అదనపు కోణాన్ని జోడించారు. అన్ని మూజిగల్‌ అకాడమీలలో జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు మరపురాని ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
 
ముజిగల్ అకాడమీ నిర్వహించిన ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు ఈ దినోత్సవ వైభవాన్ని చాట్ చెప్పాయి. అపూర్వ  ప్రతిభావంతులైన సాయి శ్రీచరణ్, సాయివల్లి శివానిలు ఈ సంగీత కచేరీకి హాజరైన వారిని స్వర తరంగాలతో ఓలలాడించారు. వారి అపురూపమైన గాత్రం, ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆకట్టుకునే ఈ కచేరీతో పాటు, ఈ కార్యక్రమంలో ఓపెన్ మైక్ సెషన్‌ను సైతం అందుబాటులో ఉంచారు, ఇది ఔత్సాహిక సంగీతకారులకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి వేదిక. ప్రతిభావంతులైన ప్రదర్శకులు తమ అసాధారణ నైపుణ్యాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు, హాజరైన ప్రతి ఒక్కరిపై చెరగని ముద్ర వేశారు.
 
ప్రపంచ సంగీత దినోత్సవం రోజున ఇలాంటి మరపురాని కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని ముజిగల్ అకాడమీ వ్యవస్థాపకులు లక్ష్మీనారాయణ అన్నారు. "సంగీతానికి అందరినీ ఏకం చేసే శక్తి వుంది. దానికి ఎల్లలు లేవు. ఈ కార్యక్రమం ద్వారా కళాకారులు మరియు వర్ధమాన ప్రతిభావంతులకు ఒక వేదికను అందించడమే మా లక్ష్యం. సాయి శ్రీచరణ్, సాయివల్లి శివాని, వాగ్దేవి, శశాంక్ మరియు పాల్గొన్న వారందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.  మేము మా విద్యార్థుల సంగీత ఆకాంక్షలను పెంపొందించడానికి మరియు వారికి అసాధారణమైన అభ్యాస అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము.." అని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు సంగీత ఔత్సాహికుల  ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.