శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (12:33 IST)

పుష్ప 2లో అల్లు అర్జున్, సుకుమార్ కష్టాన్ని నిర్మాతలు బ్రేక్ చేశారా?

pushpa2 latest
pushpa2 latest
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా 350 కోట్ల బడ్జెట్ తో తీసినట్లు వార్తలు వచ్చాయి. దానిని  డబుల్ ది ఎమౌంట్ గా నిర్మాతలు అమ్మేసుకున్నారు. నెట్ ఫ్లిక్స్ 120 కోట్లకు అమ్మేశారు. అయితే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారని టాక్ టాలీవుడ్ లో నెలకొంది. దానికి కారణాలు లేకపోలేదు. విడుదలైన మొదటి రోజు కలెక్టన్లు  250 కోట్లు గ్రాస్ వచ్చేసింది. మొదటిరోజు అయితే అసలు టికెట్ రేటు  500, 800 రూపాయలుగా టికెట్ పెంచేయడం కూడా ఓ కారణంగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
 
రెండోరోజు అనగా నేడు కొన్ని చోట్ల థియేటర్లు ఖాలీగా వుండడం ఆశ్చర్యానికి గురిచేసింది.  విజయవాడ రాజ్ యువరాజ్, రవీంద్ర సినిమా, గుంటూరు నాజ్ సెంటర్ పి.వి.ఆర్., స్వర్ణ మల్టీప్లెక్స్, గోరంట్ల థియేటర్, ఒంగోలు, ఈరోజు ఖాలీగా వున్నాయి. గాజువాక వైజాగ్ మోహినీ సినిమా థియేటర్లు ఖాలీగా వుంది. వైజాగ్ చిత్రాలయ మాల్స్ ఈరోజు ఖాళీ వున్నాయి. అయితే రాజమండ్రి, తిరుపతిలో మాత్రం ఫుల్ గా బుక్ అయ్యాయి. శ్రీకాకుళం మోస్తరుగా ఫుల్ అయింది. ఇదంతా బుక్ మై షో రిపోర్ట్ ఆధారంగా ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
ఇలా అవడానికి కారణం హయ్యస్ట్ రేటుతో థియేటర్లలో పెంచడంతో పాటు ఏ ఊరిలో థియేటర్ లో చూసినా పుష్ప 2 సినిమాలో వేయడం కూడా ప్రధానలోపంగా తెలుస్తోంది. ఇక మినియం 200 రూపాయల టికెట్ ను ఒక్క టికెట్ 800 రూపాయలుగా పెరగడం వల్ల మైనస్ గా భావిస్తున్నారు. సినిమాలకు, రాజకీయాలకు ఫైనాన్సియర్లు కూడా కొందరు వుండడంతో అందుకు తగిన విధంగా టికెట్ల రేటు పెంచేసుకుంటున్నారనే అందరికీ తెలిసిందే. మొదటి రోజు ఫుల్ కలెక్టన్లు బాగానే వున్నాయి. కానీ హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో అసలు షోనే వేయకపోవడం కూడా మైనస్ గా సినీపెద్దలు భావిస్తున్నారు.
 
కనుక థియేటర్లు బతకాలన్నా ప్రేక్షకులు రావాలన్నీ కళకళలాడాలన్నా టికెట్ల రేటు కీలకం. ఖుషి, ఒక్కడు, సింహాద్రి, నువ్వేకావాలి, పోకిరి సినిమాలు నాన్ స్టాప్ గా యాభై రోజులు నడుస్తూ వందరోజులు వెళ్ళిన సందర్భాలున్నాయి. అప్పట్లో సినిమాలపై నమ్మకంతో నిర్మాతలు వుండేవారు. కానీ ఇప్పుడు నిర్మాతల అత్యాశతో ముందుగా త్రిబుల్ గా టికెట్ల రేట్లు పెంచేసుకుంటున్నారు. అంటే వారికీ తమ సినిమాలపై నమ్మకంలేదనే చెప్పాలి. అందుకే పెద్ద పెద్ద నిర్మాతలు సినిమాలు తీయడం, హై పీక్ లో పబ్లిసిటీ చేయడం, సినిమాలను అమ్మేయడం జరుగుతుంది. పుష్ప 2 విషయంలో ఐటెం సాంగ్ పెట్టి శ్రీలీలను పెట్టినా అస్సలు ప్రయోజనమే కనిపించలేదు. శ్రీలీలకు నిర్మాతలు ఇచ్చిన పబ్లిసిటీ మినహా ప్రేక్షకులు నిరాశకు గురయ్యాడు కూడా.
 
బిజినెస్ పరంగా చూసుకుంటే, తమిళనాడు 52,  కేరళలో 20 కోట్లు, ఓవర్ సీస్ లో 100 కోట్లు మొత్తంగా 600 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. కానీ రెండో రోజుకు మాత్రం ఒక్కసారిగా పడిపోయింది. సినిమా బాగున్నా థియేటర్లు ఖాలీగా వున్నాయంటే పుష్ప 2 ఓ గుణపాఠంగా తీసుకోవాలి. సుకుమార్, అల్లు అర్జున్ కష్టం మొత్తం పుష్ప 2లో వుంది. సుకుమార్, అల్లు అర్జున్ చాలా కష్టపడి చెమటోడ్చి పనిచేశారు.  అల్లు అర్జున్ ఇంకా ఇంతలా కష్టపడతాడోలేదో తెలీదు. కానీ నిర్మాతలు మాత్రం హీరోల, దర్శకుల కష్టాన్ని డబ్బులతో గుమ్మరించి అవి రాబట్టుకోవడమే అత్యాశగా వుండడమే ఇలాంటి పరిస్థితి నెలకొందని సినీ ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.